ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యానికి మీరు చేసే ఎన్నో రకాల ఔషధాలు రుచికి చేదుగా ఉంటాయి.అవును ఆరోగ్యానికి ఏది మంచిదో అది చాలామందికి నచ్చదు.
కాకరకాయ( Kakarakaya ) అంటే చాలామందికి పెద్దగా ఇష్టం ఉండదు.ఎందుకంటే అది చేదుగా ఉంటుంది.
కానీ కాకరకాయతో జ్యూస్ చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.కాకరకాయ జ్యూస్ తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయలో ఐరన్, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, క్యాల్షియం, ఫైబర్, మాంగనీస్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.

కాకర రసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) కూడా ఉన్నాయి.కాకర రసం తాగడం వల్ల మధుమేహం( diabetes ) అదుపులో ఉంటుంది.కాకరకాయలో ఉండే కొన్ని ప్రోటీన్లు దీనికి ఎంతగానో ఉపయోగపడతాయి.
కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు కాకరకాయ రసం క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి.విటమిన్ సి ఎక్కువగా ఉండే కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి త్వరగా పెరుగుతుంది.
కాకరకాయ అధికంగా ఉండే కూరగాయ.అందుకే కాకరకాయ రసం జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.

దీని వల్ల మలబద్ధకం ( Constipation ) నుంచి ఉపశమనం పొందవచ్చు.కాకరకాయ కాలేయాన్ని టాక్సిన్స్ లేకుండా ఉంచుతుంది.ఇది కాలేయ ఎంజైమ్‌లను పెంచి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అలాగే కాకరకాయలో తక్కువ క్యాలరీలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
విటమిన్ ఏ మరియు సి ఎక్కువగా ఉండే కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది.అయితే రుచితో సంబంధం లేకుండా ఆరోగ్యానికి మంచిదైతే చాలు అనుకునే వాళ్ళు సంతోషంగా కాకర జ్యూస్ తీసుకోవచ్చు.







