అగమ్యగోచరంగా ఉపాధి హామీ కూలీల పరిస్థితి

నల్లగొండ జిల్లా: భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఎండలు ఓ రేంజ్ లో మండిపోతున్నాయి.ఉదయం ఏడు దాటితే చాలూ ఎండ ఏడిమి,ఉక్కపోత,వడగాలి తీవ్రతతో జనజీవనం అస్తవ్యస్తమైపోతుంది.

 Unfathomable Employment Guarantee Situation Of Labourers, Employment Guarantee L-TeluguStop.com

ఈ పరిస్థితుల్లో మాడుగులపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలు పొట్టకూటి కోసం పనులకు వెళుతున్నారు.ఉదయం 6 గంటలకు వెళ్ళి 11 గంటల వరకు మండుటెండల్లో సైతం పనులు చేస్తున్నారు.

పనులు జరుగుతున్న ప్రదేశంలో కూలీలకు సౌకర్యాలు ఏమాత్రం కనిపించవు.ఎండల నుండి ఉపశమనం పొందడానికి టెంట్ వేయాలి, తాగునీరు సరఫరా చేయాలి, మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి,ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలి.

కానీ, ఈ మండలంలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.గతంలో కూలీలకు గడ్డపార,పార,తట్ట,గొడ్డలి వంటివి ఇచ్చేవారు.

ఇప్పుడు వాటి ఊసే లేదు.2005 లో ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పటి నుంచీ అయిన కూలీలే సొంతంగా పనిముట్లు,తాగునీరు తెచ్చుకొని పనులు చేస్తున్నారు.గతంలో కొన్ని గ్రామపంచాయతీల్లో కూలీలకు అందజేసిన తట్ట,పార,గడ్డపార గొడ్డలి కనుమరుగయ్యాయి.జిల్లాలో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నూతనంగా తట్టా, పార,గొడ్డలి అందజేయాలని కూలీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

అలాగే జిల్లాలో ఇప్పటికే నిప్పుల కొలిమిలుగా మారిన ఎండలో కూలీలు పనిచేస్తున్నప్పటికీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు,టెంటు, వాటర్ సదుపాయం లేకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ ఉపాధి కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించినప్పటికీ నీటిమీద రాతలు గానే మిగిలిపోయాయని,గతంలో ఉపాధి కూలీలకు పేస్లిప్లు అందజేసేవారని,కానీ, ఇప్పుడు వారికి ఎంత రోజువారి కూలి వస్తుందో అర్థం కావడం లేదని ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం కూలీలకు ఆన్లైన్ పద్ధతి ద్వారా కూలీలకు నేరుగా ఎకౌంట్లో రోజువారి కూలీ జమ చేస్తున్నారని,కాగా కూలీలకు ఎంత జమవుతుంది అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు.ఉపాధి కూలీలకు కనీసం రోజువారి కూలీ రూ.500 ఇవ్వాలని ప్రజా సంఘాలు పలుమార్లు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.ఉపాధి కూలీల ప్రదేశాన్ని సంబంధిత అధికారులు సందర్శిస్తారు.

కానీ, సమస్యలను పట్టించుకోరని ఆరోపణలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లాలో ఉపాధి కూలీల పనుల ప్రదేశాన్ని సందర్శించి వారికి అవసరమైన సకల సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube