ఎటువంటి మచ్చ లేకుండా ముఖ చర్మం అద్దంలా మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ముఖ్యంగా కొరియన్ అమ్మాయిలు ఇటువంటి చర్మాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు.
వారిని చూసినప్పుడు అసూయ పడడం సర్వసాధారణం.కానీ అటువంటి చర్మాన్ని మీరు కూడా పొందవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీతో పాటు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.రెమెడీ గురించి మాట్లాడుకుంటే.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి ఉడికించాలి.
వాటర్ జెల్ స్ట్రక్చర్ లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి( Rice Flour ), వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు పిండి వేసుకోవాలి.

అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజల జెల్ మరియు వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ రెమెడీని రెండు రోజులకు ఒకసారి పాటించడం వల్ల చర్మం పై ఎలాంటి మచ్చలు ఉంటే మాయమవుతాయి.చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.
గ్లాస్ స్కిన్( Glass Skin ) మీ సొంతం అవుతుంది.

అలాగే ఈ రెమెడీని పాటించడంతో పాటు డైట్ లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నట్స్, తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.అలాగే రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ( Green Tea ) తీసుకోండి.నిత్యం అరగంట వ్యాయామం చేయండి.
విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్( Omega 3 Fatty Acids ), విటమిన్ ఈ వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోండి.ఇవన్నీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
యవ్వనాన్ని పెంచుతాయి.మరియు చర్మం అద్దంలా మెరిసిపోయేందుకు దోహదపడతాయి.