ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత, సీఎం జగన్( CM Jagan ) మ్యానిఫెస్టోపై ప్రత్యేక దృష్టి సారించారు.ఇవాళ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చిన ఆయన మ్యానిఫెస్టోపై పార్టీ నేతలతో కీలకంగా చర్చించనున్నారు.
ప్రస్తుతం సీఎం జగన్ విశాఖ( Visakhapatnam )లో ఉన్నారు.ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర కీలక నేతలతో ఆయన సమావేశం కానున్నారు.మ్యానిఫెస్టో తుది మెరుగులపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది.అయితే నవరత్నాలు కొనసాగింపా లేక.కొత్త పథకాలు ప్రకటనా అనే దానిపై సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇవాళ మ్యానిఫెస్టోను ఫైనల్ చేయనున్న సీఎం జగన్ ఈ నెల 27 లేదా 28వ తేదీన మ్యానిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది.
కాగా ఈ నెల 25న పులివెందులలో సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఈ క్రమంలో ఈసారి మ్యానిఫెస్టోలో ఎటువంటి వరాలు ఉంటాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.