ఏపీ అధికార పీఠం దక్కించుకునేందుకు ఒకవైపు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నాలు తీవ్రంగానే చేస్తున్నారు.నిత్యం జనాల్లోనే ఉంటూ, ఎన్నికల హామీలను ప్రకటిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎవరి ప్రసంగాలు జనాలను ఎక్కువ ఆకట్టుకుంటుందో వారిదే ఫై చెయ్ అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉంది.వైసీపీ( YCP )ని ,జగన్ ను టార్గెట్ చేసుకుని టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తుండగా.
చంద్రబాబు( Chandrababu Naidu ), పవన్ లను టార్గెట్ చేసుకుని జగన్ విమర్శలు చేస్తున్నారు.జగన్ చేస్తున్న విమర్శలు, ప్రసంగాల విషయంలో తడబాట్లు జరుగుతుండడం తో జగన్ ప్రసంగాలకు అనుకున్నంత స్థాయిలో మైలేజ్ రావడంలేదనే వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

అంతేకాకుండా జగన్ పేపర్ మీద రాసిన స్క్రిప్ట్ను చూసి చదువుతూ ప్రసంగిస్తుండడం వంటివి అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోవడం లేదనే వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచి వ్యక్తం అవుతున్నాయి.ఎవరో రాసి ఇచ్చన స్క్రిప్టును తప్పులు లేకుండా చదవడానికి జగన్ ఎక్కువగా కష్టపడుతున్నారు.స్థానిక సమస్యల విషయంలో పార్టీల అధినేతలకు, స్థానిక నేతలు ఆయా ప్రసంగాలను ముందుగానే రాసి ఇస్తారు.వాటినే చదువుతూ ఉంటారు మిగతా రాజకీయ అంశాలు విషయంలో ప్రత్యర్థులపై విమర్శలు చేసే విషయంలో సొంతంగానే అంతా మాట్లాడుతూ ఉంటారు.

కానీ జగన్ విషయంలో ఆ విమర్శలు కూడా చూసి చదువుతూ ఉండడం వంటివి అనుకున్నంత స్థాయిలో జనాల్లోకి వెళ్ళడం లేదు.టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) పైన విమర్శలు చేసేందుకైనా జగన్ స్క్రిప్ట్ నే నమ్ముకోవడం వంటివి కాస్త ఎబ్బెట్టుగానే ఉన్నాయి.జగన్ స్క్రిప్ట్ చదువుతూ చేస్తున్న ప్రసంగాలు జనాల్లోకి వెళ్లడం లేదు.ఈ విషయంలో జగన్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే తన ప్రసంగాలు మరింత హైలెట్ అయ్యే అవకాశం ఉంటుంది.