యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) పుట్టినరోజు మే 20వ తేదీ అనే సంగతి తెలిసిందే.తారక్ అభిమానులు ఎన్టీఆర్ పుట్టినరోజును పండగలా జరుపుకుంటారు.
గత రెండేళ్లుగా దేవర సినిమాకు( Devara Movie ) పరిమితమైన తారక్ ఈ ఏడాది దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు( Lakshmi Pranathi Birthday ) మార్చి 26వ తేదీన అనే సంగతి తెలిసిందే.పెళ్లైన తర్వాత ప్రణతి పుట్టినరోజు గురించి తెలిసి తారక్ ఒకింత షాకయ్యాడట.
2009 సంవత్సరం మార్చి నెల 26వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్( Jr NTR Accident ) అయింది.ఆ సమయంలో తారక్ కు తీవ్ర గాయాలయ్యాయి.అయితే అదృష్టం కలిసొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న తారక్ ఆ తేదీని సెకండ్ బర్త్ డేగా భావించారు.తన సెకండ్ బర్త్ డే, లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు ఒకే తేదీ కావడంతో విధిరాత అంటే ఇదేనని తారక్ భావించారని సమాచారం అందుతోంది.
దేవర రిలీజ్ కు మరో 5 నెలల సమయం ఉన్నా ఈ సినిమా బిజినెస్ ను వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మరీ భారీ రేంజ్ లో ఆఫర్లు అయితే రావడం లేదు.సోలో హీరోగా ఎన్టీఆర్ మార్కెట్ గురించి క్లారిటీ లేకపోవడం, కొరటాల శివ( Koratala Siva ) ఆచార్య సినిమా భారీ నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో ఈ సినిమాకు ఇతర పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే తక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.
త్వరలో దేవర మూవీ పూర్తి బిజినెస్ కు సంబంధించి క్లారిటీ రానుంది.అయితే ఇతర భాషల్లో దేవర సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటం ఊహించని స్థాయిలో కలిసొస్తుండటం గమనార్హం.దేవర పార్ట్1 సక్సెస్ సాధిస్తే దేవర 2 సినిమాపై అంచనాలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.