వేసవి కాలంలో కోడిగుడ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారా.. అయితే జాగ్రత్త..!

ఎండాకాలంలో ఏదైనా తక్కువగానే తీసుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.అలాగే తినే ఆహారం రుచిగా ఉందని ఎక్కువగా తినేస్తే మాత్రం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను( Health Problems ) ఎదుర్కోక తప్పదు.

 Side Effects Of Eating Eggs In Summer,summer Season,eggs,digestion,kidney Health-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మాత్రం ఇక ఎన్నో సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుంది.అయితే కోడి గుడ్డు( Egg )ను తీసుకునేవారు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి.

విటమిన్ ఏ, విటమిన్ బి 12, విటమిన్ డి, ప్రోటీన్, కాల్షియం, జింక్, ఫోలేట్, ఫాస్ఫరస్ వంటివి గుడ్డులో పుష్కలంగా ఉంటాయి.


అందుకే ప్రతి రోజు ఒక గుడ్డును తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఎండాకాలంలో గుడ్డు తీసుకోవడం మంచిదో కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండా కాలం( Summer Season )లో గుడ్లు అధికంగా తీసుకోవడం అసలు మంచిది కాదు.

ఎందుకంటే దాన్ని అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా చెప్పాలంటే గుడ్లు వేడిని కలిగి ఉంటాయి.వేడిగా ఉన్నప్పుడు వీటిని తీసుకోవడం వల్ల కడుపులో వికారంగా ఉండటం మాత్రమే కాకుండా ఎసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్ గా కూడా అనిపిస్తుంది.


ముఖ్యంగా చెప్పాలంటే ముఖం పై మొటిమలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అంతే కాకుండా ఎండా కాలంలో గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు( Digestion ) వస్తాయి.అలాగే కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి.

కిడ్నీ( Kidney ) ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.అందుకే గుడ్లను కాస్త తక్కువగా తీసుకోవడమే మంచిది.

అలాగే రోజు లో ఉదయం సమయంలో గుడ్డును తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube