రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్( Karimnaga ) బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్( Bandi Sanjay Kumar ) ని గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బిజెపి నాయకులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలి అంటే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ( Narendra Modi ) ని చేసుకుందామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్,వేములవాడ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, బిజెపి మండల అధ్యక్షుడు పోంచేటి రాకేష్, మేడిశెట్టి శ్రీహరి, చిర్రం తిరుపతి, విజయ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.