మహిళలపై వేదింపులకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాహూల్ హెగ్డే అన్నారు.సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 12 ఫిర్యాదు వచ్చాయని, వివిధ సమస్యలపై బాధితుల నుండి వచ్చిన అర్జిలను స్వీకరించారు.

 Harassment Of Women Will Take Strict Action Sp Rahul Hegde, Harassment Of Women-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన ప్రజావాణిలో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదులపై ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.మహిళలను గౌరవించడం మన సంప్రదాయం,మహిళల పట్ల వేధింపులకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చట్టాలను లోబడి ప్రతి పౌరుడు నడుచుకోవాలని,చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడవద్దన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube