విజయవాడ: కాంతిరాణా టాటా… పోలీసు కమీషనర్.సిఎం పై చేత్తోనే రాయి ని విసిరారు.
ఎయిర్ గన్, క్యాట్ బాల్ అనేదానికి ఆధారాలు లేవు.పడిన రాయి కూడా చేతితో సరి పోయేంత ఉంది.
ఘటన జరిగి 48 గంటలు అయ్యింది.ప్రాధమికంగా ఉన్న సమాచారం బట్టి మేము చెబుతున్నాం.
నిందితుడు దొరికితే కుట్ర కోణం తెలుస్తుంది.రాయిని చాలా బలంగా, వేగంగా విసిరారు కాబట్టే ఇద్దరికీ గాయం అయ్యింది.
సిఎం కు తగిలి, వెల్లంపల్లి కి తగిలి… రాయి అవతల పడింది.సున్నితమైన భాగాల మీద నేరుగా తగిలి ఉంటే ప్రాణాపాయం గా మారేది.వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద కేసు పెట్టాం.కింద జనాల్లో నుంచే రాయి పైకి విసిరారు.
సోషల్ మీడియా లో వచ్చే ప్రచారాలను నమ్మవద్దు.