విశాఖ: సిఎం జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి పై స్పందించిన మాజీ ఎంపీ, అరకు ఎన్డీయే కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత. సాక్షాత్తు సిఎం పైనే దాడి జరగటం దారుణం.
సిఎం స్ధాయిపైనే మీదనే దాడి జరిగితే మా లాంటి అభ్యర్ధులకు రక్షణ ఏముంటుంది.ఇది ఏపి ప్రభుత్వం వైఫల్యం.
పోటీలో వున్న అభ్యర్ధులకు కూడా రక్షణ లేకుండా పోతుంది.ఈ సంఘటన పై తక్షణం ఈసి కఠిన చర్యలు తీసుకోవాలి.
ఈ వ్యవహారంలో విఫలమైన ప్రభుత్వం తరుపున సిఎస్, డిజిపి ని తక్షణం విధులు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నా.ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తే సహించకూడదు.మా ఎన్నికలు ప్రచారం లో అధికారులు అడుగు అడుగున అడ్డుకుంటున్నారు.ఇప్పటికైనా ఏపిలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఎన్నికలు కమీషన్ కలుగ చేసుకోవాలి.