ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ( BJP ) రేపు ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది.ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా ఈ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
‘సంకల్పపత్ర’( Sankalpa Patra ) పేరుతో బీజేపీ మ్యానిఫెస్టోను ప్రకటించనుంది.అభివృద్ధి, సంక్షేమ పథకాలు, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, రైతులు, పేదలే ప్రధాన అజెండాగా బీజేపీ మ్యానిఫెస్టో ఉండనుంది.
కాగా ఈ మ్యానిఫెస్టోను కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్( Rajnath Singh ) నేతృత్వంలోని కమిటీ రూపొందించింది.ప్రజల నుంచి సుమారు 15 లక్షల సలహాలు, సూచనలు తీసుకున్న కమిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మ్యానిఫెస్టో రూపకల్పన చేసిందని తెలుస్తోంది.
నమో యాప్ ద్వారా సంకల్పపత్ర కోసం సుమారు నాలుగు లక్షలకు పైగా ప్రజలు సలహాలు, సూచనలు చేశారు.