వరలక్ష్మి శరత్ కుమార్( Varalakshmi Sarathkumar ). గత కొన్ని రోజులుగా ఈమె గురించే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చర్చ సాగుతుంది.
ఆమె గ్యాలరిస్ట్ ఆయన నికోలయి సచ్ దేవ్( Nicholai Sachdev ) అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దానికి సంబంధించిన ఎంగేజ్మెంట్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వీరి పెళ్లి త్వరలోనే జరగబోతోంది.నికోలయి సచ్ దేవ్ ఒక గ్యాలరీస్ పైగా 17 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని విడాకులు కూడా తీసుకున్నాడు.
వయసులో వరలక్ష్మి కన్నా కూడా చాలా పెద్దవాడు.పైగా ఇతడికి 15 ఏళ్లకు కూతురు కూడా ఉంది.
నికోలయి మొదటి భార్య పేరు కవిత( Kavitha ). ఆమె మోడలింగ్ చేస్తూ అందాల పోటీల్లో పాల్గొంది.2007 నుంచి 14 వరకు రకరకాల పోటీల్లో ఆమె పాల్గొని పలు పోటీల్లో ఫైనల్ వరకి చేరుకుంది.<
కవిత మరియు నికోలయి సచ్ దేవ్ మధ్య కొన్నాళ్ళకి విభేదాలు రావడంతో వారు విడాకులు తీసుకున్నారు.ఈ జంటకు పుట్టిన అమ్మాయి ఇటీవలే అథ్లెటిక్స్( Athletics ) లో ఛాంపియన్ గా కూడా మెరిసింది.అయితే ఎటోచ్చి ఇప్పుడు అందరి సమస్య ఏంటి అంటే అంత వయసున్న వ్యక్తిని అలాగే అంత పెద్ద కూతురు ఉన్న వ్యక్తిని వరలక్ష్మి ఏరికోరి ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అనే విషయం.
పైగా వీరిద్దరి పరిచయం ఇప్పటిది కాదు వీరికి గత పది, పన్నెండేళ్లుగా స్నేహం ఉందట.అతని వ్యక్తిత్వం చాలా దగ్గర నుంచి చూసింది కాబట్టే ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి( Love Marriage ) చేసుకుంటుంది.
మొదట వీరి పెళ్లికి కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా అంగీకారం దొరకకపోయినా ఆ తర్వాత అందరూ ఒప్పుకొని వీరి నిశ్చితార్థం చాలా ఘనంగా చేశారు.
వరలక్ష్మి తలుచుకుంటే ఎంత మంచి అబ్బాయి అయినా సరే ఓకే చెప్తాడు.కానీ ఈ హీరోయిన్స్( Heroines ) కి ఉన్న జబ్బు ఏంటో కానీ పెళ్లయిన వాడిని లేదా విడాకులు తీసుకున్న వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.అలా అయిన వారి జీవితాలు కూడా సరిగ్గా ఉండవు.
మరి ఇప్పుడు వరలక్ష్మి ఇంత పెద్ద డేరింగ్ స్టెప్ వేయడం వెనక గల కారణం ఏంటో తెలియదు కానీ ఆమె మొదట హీరో విశాల్( Hero Vishal ) తో ప్రేమలో పడి కొన్నాళ్ల తర్వాత ఆమె తండ్రి తో అతడికి విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పేసుకున్నారు.ఆ తర్వాత ఘాటుగా విశాలపై చాలాసార్లు ఓపెన్ కామెంట్స్ చేసింది వరలక్ష్మి.
ఇక ఇప్పుడు పోయి పోయి నికోలయి వంటి రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకుంటుంది.మరి చూడాలి ఆమె జీవితంలో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో.