రాజన్న సిరిసిల్ల జిల్లా : స్వర్గీయ మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి కుమారుడు నేవూరి సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం సురేందర్ రెడ్డి సతీమణి నేవూరి ప్రమీల ఆమె కూతురు నేవూరి సౌజన్య రెడ్డి ఆలయ పునర్ నిర్మాణం కోసం వీరు 50,000 అక్షరాల యాభై వేల రూపాయలు విరాళంగా అందజేశారు.శనివారం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పునర్ నిర్మాణం కోసం విరాళం అందించారు.
వీరి పేరు ఆలయ నిర్మాణం జరిగిన తరువాత వీరి కుటుంబ సభ్యుల పేర్లను శిలాఫలకం పై ముద్రిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఆలయం నకు ఆన్న ప్రసాన కోసం వచ్చిన హైదరబాద్ లో స్థిర పడ్డ ఎల్లారెడ్డి పేట కు చెందిన ముప్పవరం ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు 10,116 అక్షరాల పది వేల నూట పదహారు రూపాయలు విరాళంగా ఇచ్చారు.
అదే విధంగా ప్రీతి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అమరేందర్ రెడ్డి ,సాయి బాబా ఆలయ అర్చకులు గుండయ్య శర్మ లు సైతం విరాళంగా అందజేశారు.మొదటి రోజు సేకరించిన విరాళం రూపాయలు సుమారు లక్ష రూపాయల వరకు చేరుకుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్,కార్యదర్శి ఒగ్గు బాలరాజు యాదవ్, బండారి బాల్ రెడ్డి, పందిర్ల శ్రీనివాస్ గౌడ్,లింగాల దాసు లు ఉన్నారు.







