బాల్య వివాహాన్ని ఎదురించింది.. ఇంటర్ లో 421 మార్కులు.. ఈ యువతి గ్రేట్ అంటూ?

ప్రస్తుత కాలంలో గతంతో పోల్చి చూస్తే బాల్య వివాహాలు తగ్గాయనే సంగతి తెలిసిందే.అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి.

 Nirmala Inspirational Success Story Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

అయితే ఒక యువతి మాత్రం బాల్య వివాహాన్ని ఎదురించి ఇంటర్ పరీక్షలలో సత్తా చాటారు.తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 440 మార్కులకు నిర్మల ( Nirmala )అనే యువతి ఏకంగా 421 మార్కులు సాధించి ప్రశంసలు అందుకున్నారు.

కర్నూలు జిల్లా( Kurnool )లోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన నిర్మల 10వ తరగతిలో 537 మార్కులు సాధించారు.అయితే తల్లీదండ్రులు ఈ యువతికి పెళ్లి చేయాలని అనుకున్నారు.

పెళ్లి అంటే ఇష్టం లేని ఈ యువతి ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని తల్లీదండ్రులకు చెప్పారు.తాజాగా విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్( Inter first year ) ఫలితాలలో సత్తా చాటి ప్రశంసలు అందుకున్నారు.

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో చదువుకున్న ఈ బాలిక తన సక్సెస్ తో అంచెలంచెలుగా ఎదిగారు.

Telugu Ap Inter, Inspirational, Inter, Kurnool, Nirmala, Praveen Prakash, Story-

ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సైతం బాలిక చదువు కోసం తన వంతు సహాయం చేశారు.తన చదువుకు సహకరించిన వాళ్లకు నిర్మల కృతజ్ఞతలు తెలిపారు.ఇంటర్ బైపీసీలో మంచి మార్కులు సాధించిన ఈ యువతి సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్( Praveen Prakash ) ఆమెను అభినందించారు.

Telugu Ap Inter, Inspirational, Inter, Kurnool, Nirmala, Praveen Prakash, Story-

భవిష్యత్తులో నిర్మల ఐపీఎస్ లక్ష్యాన్ని సాధించి తనలో చదువుకోవాలనే భావన ఉన్న విద్యార్థులలో స్పూర్తి నింపాలని నెటిజన్లు కామెంట్లు చేశారు.మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్విట్టర్ పేజ్ ద్వారా ఈ విషయాలను పంచుకోగా ఈ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.నిర్మల టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

నిర్మల కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube