వైసిపి ని టార్గెట్ చేసుకుంటూ మరోసారి తన విమర్శలకు పదును పెట్టారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.( YS Sharmila ) ముఖ్యంగా కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని( Avinash Reddy ) టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేశారు.
ఈరోజు వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో( Jammalamadugu Constituency ) ముద్దనూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో షర్మిల ఘాటుగా విమర్శలు చేశారు. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్ రెడ్డిని మారుస్తున్నారనే వార్తలు వస్తున్నాయని షర్మిల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
తాను జమ్మలమడుగు లోని క్యాంటెల్ ఆసుపత్రిలో పుట్టా.నా జన్మ స్థలం ఇదే.వైఎస్ రాజశేఖర్ రెడ్డి , వివేకానంద రెడ్డి మీ నాయకులు.మాతో ఎలా ఉన్నారో ఇక్కడి ప్రజల కోసం అలాగే ఉన్నారు.
ఎప్పుడు పిలిచినా పలికేవారు.వివేకం సార్ అని పిలిస్తే వెంటనే సమస్యకు పరిష్కారం దొరికేది.ఈ జిల్లాకు స్టీల్ ప్లాంట్ తీసుకురావాలని వైఎస్ఆర్ కలలు కన్నారు. దాంతో లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని భావించారు. జగన్( Jagan ) రెండుసార్లు శంకుస్థాపన చేశారు. కానీ పనులు జరగలేదు.
వైఎఎ్సార్ కలల ప్రాజెక్టుకే దిక్కులేదు .ఈ జిల్లాలో నా ప్రచారంతో వైసిపి లో( YCP ) వణుకు పుడుతుంది.అవినాష్ హంతకుడని ప్రజలు నమ్ముతున్నారు. ఆయనకు సంబంధించి సీబీఐ అన్ని ఆధారాలు బయట పెట్టింది.అయినా ఎలాంటి చర్యలు లేవు.
అతడిని జగన్ కాపాడుతున్నారు.సొంత బాబాయ్ ని చంపిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ సీటు ఎందుకు ఇచ్చారు.ప్రజలు నిజాలు తెలుసుకున్నారని ఆయనను మార్చాలని చూస్తున్నారు.
అవినాష్ ఓడిపోతారని తెలిసే మారుస్తున్నారా? హత్య రాజకీయాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు .సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసి ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలి.ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నా.వైఎస్ బిడ్డ కావాలో, హంతకుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలి అని షర్మిల సూచించారు.