సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్( Tirumalagiri Market ) కు రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చి చేరుతుంది.మార్కెట్ కు రైతులు ట్రాక్టర్లతో ధాన్యాన్ని తీసుకువస్తున్నారు.
ఒక్కసారిగా ధాన్యాన్ని పెద్ద ఎత్తున తీసుకురావడంతో జనగామ – సూర్యాపేట హైవే( Jangaon Suryapet Highway )పై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.రెండు రోజుల సెలవు అనంతరం వ్యవసాయ మార్కెట్ తెరుచుకోవడంతో రద్దీ పెరిగింది.
ధాన్యం ట్రాకర్టు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో జాతీయ రహదారిపై సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.