అబ్బాయికి డాక్టరేట్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన బాబాయ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఇటీవల వేల్స్ యూనివర్సిటీ( Wales University ) నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి తెలిసిందే.నేడు సాయంత్రం జరగబోయే స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ పాల్గొనబోతున్నారు.

 Pawan Kalyan Special Post To Ramcharan For Getting Doctorate ,ramcharan,pawan Ka-TeluguStop.com

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు డాక్టరేట్ ప్రధానం చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ విధంగా రాంచరణ్ డాక్టరేట్ అందజేస్తున్నారని విషయాన్ని యూనివర్సిటీ ప్రకటించడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.

  ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు.

Telugu Doctorate, Pawan Kalyan, Pawankalyan, Ramcharan, Wales-Movie

ఇలా నటుడుగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసినందుకుగాను ఈయనకు వేల్స్ యూనివర్సిటీ డాక్టర్ ప్రధానం చేసింది.ఇక నేడు డాక్టరేట్ అందుకోబోతున్న నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.చలన చిత్ర పరిశ్రమలో తనదైన పంథాలో పయనిస్తున్న శ్రీ రాంచరణ్ కి గౌరవ డాక్టరేట్ దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.

  శ్రీ రామ్ చరణ్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.

Telugu Doctorate, Pawan Kalyan, Pawankalyan, Ramcharan, Wales-Movie

అలాగే చెన్నై వేల్స్ యూనివర్సిటీ చరణ్ చిత్ర పరిశ్రమకు చేస్తున్న సేవలకు, తన ప్రతిభకు గుర్తింపుగా ఈ డాక్టరేట్ ఇవ్వడం సంతోషకర పరిణామం.డాక్టరేట్ అందుకున్న స్ఫూర్తితో రామ్ చరణ్ మరెన్నో విజయవంతమైన సినిమాలు చేస్తూ మరిన్ని పురస్కారాలు, ప్రజాభిమానం పొందాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కు డాక్టర్ అయితే రావడంతో అభినందనలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్టు వైరల్ గా మారింది.అయితే ఇదే యూనివర్సిటీ నుంచి పవన్ కళ్యాణ్ కి కూడా డాక్టరేట్ ప్రకటించగా ఆయన మాత్రం డాక్టరేట్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube