వివో T3x 5G స్మార్ట్ ఫోన్ సరికొత్త ఫీచర్లతో లాంచింగ్ ఎప్పుడంటే..?

వివో T3x 5G స్మార్ట్ ఫోన్( Vivo T3X 5G Smartphone ) సరికొత్త ఫీచర్లతో భారత మార్కెట్లో ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం లాంచ్ అవ్వనుంది.ఫ్లిప్ కార్ట్ మైక్రో సైట్ ప్రకారం ఈ ఫోన్ ధర భారత మార్కెట్లో రూ.15 వేలలోపు ఉండనుంది.ఇప్పటికే ఈ ఫోన్ ఫీచర్లను కంపెనీ రివిల్ చేసేసింది.

 Vivo T3x 5g Smartphone Features And Launching Details-TeluguStop.com

ఈ ఫోన్ డిజైన్ తో పాటు ఫీచర్ల గురించి తెలుసుకుందాం.వివో T3x 5G స్మార్ట్ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్ ప్లే తో వస్తోంది.క్వాల్కం స్నాప్ డ్రాగన్ 6జెన్ 1 చిప్ సెట్ తో వస్తుంది.6000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 44W ఫాస్ట్ ఛార్జింగ్( Fast Charging ) కు మద్దతు ఇవ్వనుంది.ఈ స్మార్ట్ ఫోన్ పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లతో వస్తుంది.

డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ తో వస్తుంది.ఈ ఫోన్ 0.79 సెంటీమీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

Telugu Vivo Smartphone, Vivo Tx Camera-Technology Telugu

ఈ స్మార్ట్ ఫోన్ వెనుక వైపు పెద్ద సర్క్యులర్ కెమెరా మాడ్యూల్( Circular Camera Module ) తో ఉంటుంది.ఇందులో రెండు కెమెరాలు, LED ఫ్లాష్ యూనిట్ ఉన్నాయి.ఫోన్ కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్లు ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్ 4GB, 6GB, 8GB RAM వేరియంట్ ఆప్షన్ లలో లభించనుంది.స్టోరేజ్ మాత్రం 128GB తో ఉంటుంది.

Telugu Vivo Smartphone, Vivo Tx Camera-Technology Telugu

ఫోన్ కెమెరా( Camera Features ) విషయానికి వస్తే.50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ తో ఉంటుంది.వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ రెడ్, గ్రీన్ అని రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.

ఇక ఈ ఫోన్ కు సంబంధించిన మిగతా వివరాలు లాంచింగ్ సమయంలో తెలియనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube