ఆ ఛాన్స్ వస్తే చెన్నై వదిలి తెలుగులో సినిమాలు చేస్తా.. బిచ్చగాడు హీరో కామెంట్స్ వైరల్!

బిచ్చగాడు, బిచ్చగాడు2( Bichagadu 2 ) సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ ఆంటోని తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం విజయాలను అందుకుని ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.విజయ్ ఆంటోని రొమాంటిక్ జానర్ లో నటించిన లవ్ గురు మూవీ( Love Guru Movie ) ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

 Vijay Antony Comments About Direct Telugu Movies Details Here ,vijay Antony,telu-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ ఆంటోని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నేనెప్పుడూ వర్తమానంలోనే జీవిస్తానని భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించనని ఆయన తెలిపారు.

భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల మనం కోరుకున్నది దక్కకుండా మరొకటి దక్కితే నిరాశ చెందాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.మనకు ఏది ఇవ్వాలో ఏది కావాలో విశ్వం చూసుకుంటుందని విజయ్ ఆంటోని పేర్కొన్నారు.

Telugu Bichagadu, Love Guru, Telugu, Vijay Antony, Vijayantony-Movie

లవ్ గురు సినిమా విషయంలో కూడా నేను ఇదే విధంగా ఆలోచించానని ఆయన తెలిపారు.లవ్ గురు మూవీ కథ విన్న సమయంలోనే ఈ సినిమా సక్సెస్ పై నమ్మకం కలిగిందని విజయ్ ఆంటోని( Vijay Antony ) పేర్కొన్నారు.ఈ సినిమా డైరెక్టర్ వినాయక్ వైద్యనాథన్( Vinayak Vaithianathan ) తన లైఫ్ లో జరిగిన అనుభవాల ఆధారంగా లవ్ గురు సినిమాను తెరకెక్కించారని విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు.లవ్ గురు సినిమా చూసిన తర్వాత జీవిత భాగస్వామిని ఎలా ప్రేమించాలో తెలుసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

Telugu Bichagadu, Love Guru, Telugu, Vijay Antony, Vijayantony-Movie

నాకు మెమొరీ పవర్ తక్కువని అందువల్లే తెలుగు భాష నేర్చుకోలేకపోయానని విజయ్ ఆంటోని తెలిపారు.నాకు తెలుగు వచ్చి ఉంటే డైరెక్ట్ గా తెలుగులో సినిమాలు చేసేవాడినని ఆయన అన్నారు.అలాంటి ఛాన్స్ ఉంటే చెన్నై వదిలి వచ్చేవాడినని విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు.2026 సంవత్సరం సమ్మర్ లో బిచ్చగాడు3( Bichagadu 3 ) రిలీజ్ కానుందని ఆయన తెలిపారు.విజయ్ ఆంటోనికి తెలుగులో సైతం భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube