14 మీటర్ల గుడుంబా, 100 లీటర్ల బెల్లం,10 కిలోల స్పటిక, 10 కిలోల ఇప్పపువ్వు ఒక ద్విచక్ర వాహనం సాధనం ఇద్దరిపై కేసు నమోదు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో గుడుంబా స్థావరాలపై ఎల్లారెడ్డిపేట సీఐ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు.మండలంలోని రాశి గుట్ట, బుగ్గ రాజేశ్వరి తండా గ్రామాలలోని గుడుంబా స్థావరలపై ఆకస్మిక తనిఖీ చేయగా 14 మీటర్ల గుడుంబా, 100 లీటర్ల బెల్లం,10 కిలోల స్పటిక, 10 కిలోల ఇప్పపువ్వు ఒక ద్విచక్ర వాహనం సాధనం చేసుకొని ఇద్దరు పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా సరే గుడుంబా అమ్మిన తయారు చేసిన రవాణా చేసి వారిపైన ప్రత్యేక నిగా తోపాటు కఠిన చర్యలు ఉంటాయని వారు పేర్కొన్నారు.ఈ దాడులలో కానిస్టేబుల్ భూక్యా రాజు, కిషోర్, మల్లేష్, కృష్ణ కాంత్,మహిళా కానిస్టేబుల్ లావణ్య శ్రీ వాణిలు పాల్గొన్నారు.