అమెరికా అధ్యక్ష ఎన్నికల( US presidential election ) సందడి ఆ దేశంలో తారాస్థాయికి చేరింది.రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల తరపున డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌లు అధికారికంగా నామినేషన్ పొందారు.
ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.తాజాగా ఫ్లోరిడాలో బిలియనీర్ ఫైనాన్సియర్ జాన్ పాల్బన్ ఆధ్వర్యంలో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో బైడెన్‌పై మండిపడ్డారు ట్రంప్.
డెన్మార్క్ వంటి మంచి దేశాల నుంచి అమెరికాకు ప్రజలు వలస రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జో బైడెన్( Joe Biden ) వైట్‌హౌస్‌లోని చారిత్రాత్మక రెజల్యూట్ డెస్క్‌ను మురికి చేశారని ట్రంప్ భగ్గుమన్నారు.
ఈ డెస్క్‌ను దాదాపుగా అమెరికా మాజీ అధ్యక్షులందరూ ఉపయోగించారని పేర్కొన్నారు.డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార బృందం ఈ విరాళాల సేకరణ కార్యక్రమం ద్వారా 50.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.

జైళ్ల నుంచి , విపత్తు కలిగించే దేశాల నుంచి ఇప్పుడు అమెరికాకు వలసలు పెరుగుతున్నాయని ట్రంప్ అన్నారు.తద్వారా బైడెన్ పరిపాలనా యంత్రాంగానికి తలనొప్పిగా మారిన అమెరికా సరిహద్దు పాలసీ, వలస సంక్షోభాన్ని ట్రంప్ మరోసారి టార్గెట్ చేశారు.మంచి దేశాల నుంచి వచ్చే వ్యక్తులను మనం ఎందుకు అనుమతించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మీకు డెన్మార్క్, స్విట్జర్లాండ్ వంటి మంచి దేశాలు తెలుసా.నార్వే ఎలా వుంటుందంటూ ట్రంప్( Donald Trump ) ప్రశ్నలు సంధించారు.

వైట్‌హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రకారం.మాజీ అధ్యక్షులు లిండన్ బి జాన్సన్, రిచర్డ్ నిక్సన్, గెరాల్ ఆర్ ఫోర్డ్ మినహా దాదాపుగా ప్రతి అధ్యక్షుడు ఉపయోగించిన రిజల్యూట్ డెస్క్‌పై బైడెన్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.1880లో బ్రిటీష్ మహారాణి విక్టోరియా.నాటి అధ్యక్షుడు రూథర్‌ఫోర్డ్ బీ.హేస్‌కు బహుమతిగా ఇచ్చిన డెస్క్ గురించి ట్రంప్ ప్రస్తావించారు.1852లో అన్వేషకుడు సర్ జాన్ ఫ్రాంక్లిన్ బ్రిటీష్ ఆర్కిటిక్ యాత్రలో భాగమైన హెచ్ఎంఎస్ రిజల్యూట్ ఓడకు చెందిన ఓక్ కలపతో ఈ డెస్క్‌ను తయారు చేశారని ట్రంప్ వెల్లడించారు.తాను ఈసారి దానిని ఉపయోగించకపోవచ్చు.ఎందుకంటే ఆ డెస్క్ కలుషితమైందని ఆయన వ్యాఖ్యానించారు.







