ఆ పేరు కారణంగానే సినిమాలలో అవకాశం వచ్చింది: పృథ్వీ రాజ్ సుకుమారన్

మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్(Pruthvi Raj Sukumaran) ఒకరు.మలయాళం చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన ప్రస్తుతం తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Pruthvi Raj Sukumaran Comments About Nepotism In Industry , Pruthvi Raj Sukumara-TeluguStop.com

పృథ్వీ రాజ్ సుకుమారన్  ఇటీవల ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన సలార్ ( Salar ) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వరదరాజమన్నార్ పాత్రలో ప్రభాస్ స్నేహితుడిగా నటించి సందడి చేశారు.

Telugu Salaar, Aadu Jeevitham, Dulquer Salmaan, Kollywood, Nepo, Prabhas, Pruthv

ఈ సినిమా ద్వారా తెలుగులో ఎంతమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన మలయాళంలో నటించడం సినిమాలను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇటీవల ఆడు జీవితం( Aadu Jeevitham ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పృథ్వీ రాజ్ దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) తో తనకు ఉన్నటువంటి అనుబంధం ఇద్దరి మధ్య ఉన్న పోలికల గురించి పలు విషయాలు వెల్లడించారు.

Telugu Salaar, Aadu Jeevitham, Dulquer Salmaan, Kollywood, Nepo, Prabhas, Pruthv

మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి పోలిక ఏంటి అనే విషయానికి వస్తే మేమిద్దరం కూడా నేపోకిడ్స్ దీంతో మేమిద్దరం సులభంగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టమని తెలిపారు.ఇక నేనైతే నా ఇంటి పేరు కారణంగానే మొదటి సినిమా అవకాశాన్ని అందుకున్నానని తెలిపారు.నేను పలానా స్టార్ హీరో కుమారుడు కావడంతో నాకు మంచి అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.ఇక నా మొదటి సినిమాకు నన్ను స్క్రీన్ టెస్ట్ కూడా చేయలేదు ఆడిషన్ కూడా చేయలేదని తెలిపారు.

ఇలా నాకు తొలి సినిమా అవకాశం అందించినటువంటి నా ఇంటి పేరుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేశారు.అయితే నేను ఒకటే చెప్పగలను బయట ఎవరిని మాట్లాడిన బందు ప్రీతి కారణంగా కేవలం ఒక్క సినిమాలో మాత్రమే అవకాశం ఇవ్వగలరు ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని మనలో ఉన్న టాలెంట్ ఉపయోగించి అందుకోవాలి అంటూ ఈ సందర్భంగా పృథ్వీ రాజ్ సుకుమారన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube