త్రాగు నీటి కి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో వేసవి కాలంలో త్రాగు నీరు ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయం తో పని చేస్తూ త్రాగు నీటి సరఫరా చేయాలనీ ఉమ్మడి కరీంనగర్ ప్రత్యేక అధికారి, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్వి కర్ణన్ అన్నారు.సమీకృత జిల్లా కలెక్టరెట్ లోని సమావేశ మందిరంలో వైద్యం & కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్వి కర్ణన్ , జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్లు పి.

 Drinking Water Should Be Supplied Without Difficulty, Mission Bhagiratha, Drinki-TeluguStop.com

గౌతమి, ఖీమ్యా నాయక్ లతో కలిసి వేసవికాలంలో త్రాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ,మండల, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ వేసవికాలంలో త్రాగునీటి సరఫరా సక్రమంగా జరిగేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంచి వ్యవస్థను, కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.

సంక్షోభ సమయంలోనే మన పని తీరు పరీక్షకు గురవుతుందని, మిషన్ భగీరథ అధికారులు మండల పరిషత్ జిల్లా పరిషత్ పంచాయతీ అధికారులు సమన్వయంతో పని చేసి త్రాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు.<

రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్రాగునీటి వ్యవస్థ, మిషన్ భగీరథ ద్వారా ప్రస్తుతం అందుతున్న త్రాగునీరు ఇతర వివరాలను మండలాల వారీగా ఆయన సమీక్షించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలకు గాను పూర్తి స్థాయిలో సమృద్దిగా ప్రతి రోజూ 27.81 ఎం.ఎల్.డి నీటి సరఫరా, గ్రామీణ ప్రాంతాల్లో 43.45 ఎం.ఎల్.డి లో డిమాండ్ కు 35.59 ఎం.ఎల్.డి నీటి సరఫరా మిషన్ భగీరథ ద్వారా జరుగుతుందని, ప్రస్తుతం మిడ్ మానేర్ డ్యాం లో 7.72 టీఎంసీల నీరు ఉందని త్రాగు నీటి సరఫరా కోసం సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నందున మిషన్ భగీరథ ద్వారానే ఇంటింటికి త్రాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంచాలకులు సూచించారు.వేసవి దృష్ట్యా ఉష్ణోగ్రతలు తీవ్రంగా రోజు రోజుకు పెరుగుతున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో కొరత ఏర్పడే అవకాశం ఉందని, అప్పుడు స్థానికంగా ఉన్న ఇతర నీటి వనరులు వినియోగించాలని ఆయన తెలిపారు.

ప్రస్తుతం మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ ద్వారా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాధ్ వద్దకు ముందుగా నీరు చేరుకునే విధంగా చూడాలని అన్నారు.మిషన్ భగీరథలో అందుబాటులో ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది షిప్టుల వారిగా 24 గంటలు పని చేస్తూ డిమాండ్ మేరకు అవసరమైన నీరు గ్రామీణ ప్రాంతాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

గ్రామాలలో ప్రతి ఇంటికి ప్రణాళిక బద్ధంగా నీటి సరఫరా చేయాలని , నీటి సరఫరా లో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిష్కరించాలని అన్నారు.

త్రాగునీటి సరఫరా సజావుగా జరిగేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

త్రాగునీటి సరఫరాను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్ లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రతి రోజు ఇంటింటికి సరఫరా చేసిన నీరు, మిషన్ భగీరథ కింద వచ్చిన నీటి వాస్తవిక వివరాలు సమర్పించాలని అధికారులకు ఆయన తెలిపారు.రాబోయే రోజులలో దుర్భర పరిస్థితులను అంచనా వేసి దానిమీద సైతం ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని, సంక్షేమ సమయంలోనే మన పనితీరు బయటపడుతుందని త్రాగునీటి సరఫరాలో ఏర్పడే ఇబ్బందులు వెంటనే తెలియజేయాలని, సమస్య తీవ్రత పెరగకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఇంటికి సమృద్ధిగా త్రాగునీరు సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు.సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో, వేములవాడ, సిరిసిల్ల మున్సిపాల్టీలలో ఉన్న బోర్ బావులు, పంపులు, స్థానిక నీటి వండులను గుర్తించి వాటికి అవసరమైన మరమ్మత్తు పనులు పూర్తి చేసామని తెలిపారు.

ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద సిరిసిల్ల జిల్లాలో త్రాగునీటి సరఫరా సజావుగా నిర్వహించేందుకు గాను 136 పనులకు రెండు కోట్ల 49 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇప్పటివరకు 60 పనులు పూర్తి చేశామని, మిగిలిన 75 పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.త్రాగునీటి సరఫరాను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్ లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, త్రాగునీటి సరఫరా పై ఫిర్యాదులు ఉంటే 9398684240 ఫోన్ నెంబర్ కు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు.

త్రాగునీటి సరఫరాను ప్రతి రోజు పర్యవేక్షిస్తున్నామని అవసరమైన మేర సిబ్బందిని నియమించామని, భూగర్భ జలాల నీటి స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని జిల్లాలో అవసరమున్న వారికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు.

అనంతరం అగ్రహారం లోని మిషన్ భగీరథ( Mission Bhagiratha ) ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ సందర్శించి మోటర్ల పని తీరు ను పరిశీలించారు.

ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు పి.గౌతమి, ఎన్.ఖీమ్యా నాయక్, జిల్లా పరిషత్ సీఈవో ఉమారాణి, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, మిషన్ భగీరథ ఈఈ లు జానకి, విజయ్, భూగర్భజల శాఖ అధికారి నర్సింహులు, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, ఎంపీడీవోలు, ఎంపీఓలు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube