సాధారణంగా ఈతరం అమ్మాయిలు ఏసీ గదులలో పని చేయడానికి ఇష్టపడతారు.హైదరాబాద్ కు చెందిన బండి గాయత్రి( Bandi Gayatri ) మాత్రం బిందాస్ గా ఏసీలో చేసే ఉద్యోగం వద్దని భూ గర్భ గనిలో పని చేసే కొలువును ఎంచుకున్నారు.114 సంవత్సరాల టాటా స్టీల్( TATA Steel ) చరిత్రలో ఈ ఛాన్స్ దక్కించుకున్న బండి గాయత్రి కావడం గమనార్హం.చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా స్పెషలిటీ ఉండాలని కోరుకునేదానినని బండి గాయత్రి అన్నారు.
చిన్నప్పటి నుంచి ఏది పాడైనా రిపేర్ చేసేదానినని అమ్మ మెకానికల్ ఇంజనీర్ అవుతానని ఊహించగా నేను మాత్రం మైనింగ్ ఇంజనీర్( Mining Engineer ) రంగాన్ని కెరీర్ గా ఎంచుకున్నానని ఆమె తెలిపారు.కాలు విరిగినా జేఈఈ పరీక్ష రాశానని ఆమె చెప్పుకొచ్చారు.
మంచి ర్యాంక్ సాధించి ఐఐటీ బీ.హెచ్.యూలో మైనింగ్ ఇంజనీరింగ్ లో చేరానని ఆమె పేర్కొన్నారు.మైనింగ్ ఇంజనీరింగ్ ఎందుకు ఎంచుకున్నావని చాలామంది అడుగుతారని గాయత్రి పేర్కొన్నారు.
కష్టానికి భయపడితే ఎదగలేమని దేశ భవిష్యత్తును ఊహించలేమని ఆమె కామెంట్లు చేశారు.ఈ రంగంలోకి నేను వచ్చిన తర్వాత ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నానని బండి గాయత్రి చెప్పుకొచ్చారు.భూగర్భ గనిలో 500 మీటర్ల లోతులో మైనింగ్( Mining ) పని చేయాలని పైకప్పు ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదని ఆమె అన్నారు.ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నానని ఆమె తెలిపారు.
అమ్మాయిలు చేయలేని పనులంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవని ఇష్టంగా చేసే పని ఏదైనా కష్టమనిపించదని దానికి నేనే ఉదాహరణ అని ఆమె అన్నారు.బండి గాయత్రి సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.భవిష్యత్తులో గాయత్రి కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.గాయత్రి టాలెంట్ ను ఎంత ప్రశంసించినా తక్కువేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.