తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి ఇక్కడే స్థిరపడి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారు ఉన్నారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రాంతాలలోనే సొంత ఇంటిని కొనుగోలు చేసే ఇక్కడే స్థిరపడ్డారు.
ఇలా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి హైదరాబాదులో స్థిరపడినటువంటి వారిలో నటి రాశి ఖన్నా( Rashi Khana ) ఒకరు.ఈమె ఇండస్ట్రీలోకి ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు.

మొదటి సినిమాతోనే అందరిని మెప్పించినటువంటి రాశిఖన్నా అనంతరం ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన నటించే అవకాశాలను అందుకున్నారు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటించే అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈమె హైదరాబాద్లో మరో కొత్త ఇంటిని(New House) కొనుగోలు చేశారని తెలుస్తుంది.ఇప్పటికే హైదరాబాదులో ఈమె రెండు ఇళ్లను కొనుగోలు చేశారు.

తాజాగా రాశి కన్నా మరో కొత్త ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ కొత్త ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాలను కూడా చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తన తల్లితో పాటు అత్యంత సన్నిహితులు కూడా ఈ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రస్తుతం రాశి ఖన్నా గృహప్రవేశానికి ( House Warming ) సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే తెలుగులో తెలుసు కదా అనే సినిమాలో నటిస్తున్నారు వీటితో పాటు పలు బాలీవుడ్ సినిమాలలో కూడా ఈమె నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.







