టాలీవుడ్ యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ( Anasuya ) ప్రస్తుతం వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వెండితెరపై నటిగా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇక తన పట్ల ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే వారికి తన స్టైల్ లోనే సమాధానం చెబుతారు.ముఖ్యంగా ఈమెకు విజయ్ దేవరకొండ అభిమానులకు మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలాగా ఉంటుంది.

ఒకానొక సమయంలో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) అభిమానులు ఆంటీ అంటూ అనసూయను భారీ స్థాయిలో ట్రోల్ చేశారు.అయితే ఈ వివాదాలు అన్నిటికి తాను దూరంగా ఉంటానని ఈమె ఇటీవల కాలంలో వివాదాలకు కూడా దూరంగా ఉన్నారు.ఐతే తాజాగా ఒక నెటిజన్ విజయ్ దేవరకొండ వ్యాఖ్యలకు మధ్యలో అనసూయని లాగుతూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.ఫ్యామిలీ స్టార్ సినిమా( Family Star Movie ) ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ చేస్తున్న కామెంట్స్ పై ఓ నెటిజన్ పీఆర్ మాఫియా లేపుతుందని, ఆ తర్వాత అనసూయ ఆంటీని దింపుతారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ కామెంట్ పై అనసూయ స్పందిస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.ఎందుకుఅస్తమానం నన్ను లాగుతారు.ఎవరు ఏం మాఫియా( Mafia ) చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి వదిలేశాను.అనవసరంగా నేనే హైప్ చేస్తున్నానని నా వాళ్లు అంటుంటూనే నిజమేనేమో అని వదిలేశాను.
నేను తెలంగాణ బిడ్డని నాకు సింపతి అక్కర్లేదు నాకు నా మీద అలాగే దేవుడు మీద నమ్మకం ఉందని తెలిపారు.మా అమ్మ నాన్నలు పెంచిన విధానం నన్ను ఎప్పుడు కూడా దిగజారినియ్యదు.
ఇప్పుడు ఈ ట్వీట్ ని కూడా తమ స్వర్ధానికి వాడుకున్నా నేను ఆశ్చర్యపోను.అన్నట్టు నాకు తెలిసి మీరు నేను చుట్టాలం అస్సలు కాదండి.
కాబట్టి నేను మీకు ఆంటీ కానే కాదు అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.







