ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీస్టార్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది.విజయ్ దేవరకొండ, మృణాల్ ( Vijay Devarakonda )అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూడగా సినిమా బాగానే ఉన్నా గీతా గోవిందం స్థాయిలో అంచనాలు పెంచుకోవద్దని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ మూవీ అని కమర్షియల్ మైండ్ సెట్ తో మాత్రం థియేటర్లకు వెళ్లవద్దని నెటిజన్లు చెబుతున్నారు.ప్రస్తుతం వరుసగా సెలవులు ఉండటంతో ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉందని తెలుస్తోంది.సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ రోల్ ఎలా ఉందో ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur )రోల్ అలానే ఉందని ఒక నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సెకండాఫ్ లో మాత్రం దర్శకుడు పరశురామ్( Parasuram ) ఎమోషనల్ ట్రాక్ కు ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించే కొన్ని సీన్లు ఈ సినిమాలో ఉండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.ఫ్యామిలీ స్టార్ సినిమాలో మ్యూజిక్, బీజీఎం బాగానే ఉన్నా మరీ గీతా గోవిందం స్థాయిలో అయితే లేవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం రిపీట్ అయ్యాయని అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మిడిల్ క్లాస్ ఫ్యాన్స్ కు నచ్చేలా ఈ సినిమా తెరకెక్కించారని ఫ్యాన్స్ చెబుతున్నారు.మిక్స్డ్ రివ్యూస్ తో మొదలైన ఈ సినిమా కమర్షియల్ రేంజ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.
ఈ సినిమా కలెక్షన్ల పరంగా గీతా గోవిందం రికార్డ్ ను బ్రేక్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు.







