సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఉండేవారు.
ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇక నేడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమా అన్ని భాషలలో విడుదలవుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు పొందినటువంటి నటుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకు( Vijay Devarakonda ) ఆల్ ది బెస్ట్ చెబుతూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

సాధారణంగా ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు.అలాంటిదే ఈయన ఫ్యామిలీ స్టార్( Family Star ) సినిమా విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా రేపు రిలీజ్ కాబోతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ టీంకి, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దిల్ రాజు గారికి నా విషెస్ తెలియజేస్తున్నాను అంటూ ఆల్ ద బెస్ట్ చేస్తున్నటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.ఇక ఈ పోస్టుపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఇస్తూ.ఐ లవ్ యూ ప్రభాస్ అన్న అంటూ రిప్లై ఇచ్చారు.ఇలా ఫ్యామిలీ స్టార్ కి రెబల్ స్టార్ విషెస్ తెలియజేయడంతో ఈ పోస్టుల కాస్త వైరల్ అవుతున్నాయి.
.






