కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ స్టార్ సింగర్ల రెమ్యునరేషన్లు( Tollywood Singers Remuneration ) చాలా తక్కువగా ఉండేవి.కొంతమంది సింగర్లు ఇంటర్వ్యూలలో తాము 3000 రూపాయలకు, 5000 రూపాయలకు పాటలు పాడామని బహిరంగంగా చెప్పుకొచ్చారు.
అయితే మారుతున్న కాలంతో పాటే సినిమాల బడ్జెట్లు పెరగగా ఇప్పుడు సింగర్ల పారితోషికాలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి.క్రేజ్ ఉన్న సింగర్లను ఎంచుకుంటే సినిమాలకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది.
టాలీవుడ్ స్టార్ సింగర్లలో ఒకరైన సిద్ శ్రీరామ్( Singer Sid Sriram ) 5 నుంచి 8 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.సిద్ శ్రీరామ్ పాడిన పాటలన్నీ హిట్ కావడంతో ఆ రేంజ్ లో పారితోషికం ఇస్తున్నారని భోగట్టా.లేడీ సింగర్ల గురించి చెప్పుకోవాలంటే మొదట శ్రేయా ఘోషల్( Singer Shreya Ghoshal ) గురించి చెప్పుకోవాలి.దశాబ్దాల నుంచి విజయవంతంగా శ్రేయా ఘోషల్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
ఈ సింగర్ రెమ్యునరేషన్ 4 నుంచి 7 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని భోగట్టా.
మరో స్టార్ సింగర్ రామ్ మిరియాల( Singer Ram Miriyala ) సైతం 2 లక్షల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.అనురాగ్ కులకర్ణి( Singer Anurag Kulakarni ) రెమ్యునరేషన్ కూడా దాదాపుగా ఇదే స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.మంగ్లీ( Singer Mangli ), ఎస్పీ చరణ్ కూడా లక్షన్నర నుంచి 3 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
క్రేజ్ ఉన్నంత కాలం ఈ సింగర్ల కెరీర్ కు ఢోకా ఉండదు.గీతా మాధురి( Singer Geetha Madhuri ) పారితోషికం కూడా లక్ష కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.కొన్ని స్పెషల్ సాంగ్స్ కు గీతామాధురి వాయిస్ బాగా సూట్ అవుతుంది.కొంతమంది సింగర్స్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా ట్యూన్, లిరిక్స్ నచ్చితే మాత్రమే సాంగ్ పాడటానికి అంగీకరిస్తున్నారని తెలుస్తోంది.
ఈ స్టార్ సింగర్లకు ఇతర భాషల్లో సైతం క్రేజ్ ఉండటం మరింత ప్లస్ అవుతోంది.