ఎన్నికల నేపథ్యంలో కొత్త టోల్ గేట్ల రేట్ల అమలు వాయిదా..!

వాహనదారులకు శుభవార్త తెలిపింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి అమలు కావాల్సిన కొత్త టోల్ యూజర్ ఫీజ్ రేట్ల( Toll User Fee Rates ) అమలుకు సంబంధించి తాజాగా బ్రేక్ పడింది.

 New Toll Rates On Highways To Be Effective After Lok Sabha Elections Details, No-TeluguStop.com

ఈ విషయం సంబంధించి దేశంలో జరగాల్సిన లోక్ సభ స్థానిక ఎన్నికల( Lok Sabha Elections ) నేపథ్యంలో ఎన్నికల అనంతరం దీనిని ఆచరణలోకి తీసుకురావాలని నేషనల్ హైవే ఆఫ్ ఇండియాను ఎన్నికల సంఘం ఆదేశించింది.కొత్త టోల్ రుసుము దాదాపు 5% పెరగవచ్చునని అధికారులు తెలియజేస్తున్నారు.

ఇకపోతే ఈ రేట్లు దేశంలోని ద్రవోల్బణంకు అనుగుణంగా రేట్ల వివరాల మార్పుకు సంబంధించి ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.ఇకపోతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( National Highways Authority Of India ) అధికారి వార్షిక పద్ధతిలో భాగమే ఈ రేట్ల పెంపు అంటూ వివరించారు.ఇకపోతే ఏప్రిల్ 1న దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ మార్గాలపై, అలాగే నేషనల్ హైవేలపై కొత్త టోల్ రేట్లు( New Toll Rates ) అమల్లోకి రావాల్సి ఉండగా.దానిని ఎన్నికల కమిషన్ మేరకు వాయిదా వేయడం జరిగింది.

ఇక మరోవైపు చూస్తే విద్యుత్ టారిఫ్ చార్జీలపై విద్యుత్ నియంత్రణ సంఘాలు నిర్ణయం తీసుకోవచ్చునని., అందుకు సంబంధించి ఆయా రాష్ట్రాలలో జరగాల్సిన ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మాత్రమే వాటిని కూడా అమలు చేయాలని ఎన్నికల సంఘం స్పష్టంగా తెలియజేసింది.చూడాలి మరీ మళ్ళీ విద్యుత్ ఛార్జీలు ఏ రేంజ్ లో పెరుగుతాయో ఏంటో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube