పోలింగ్ సిబ్బంది కి పక్కా గా శిక్షణ అందించాలి : వేములవాడ రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది కి శిక్షణా తరగతులు సక్రమంగా వారికి పూర్తి అవగాహన ఉండేలా శిక్షణ కార్యక్రమం లు నిర్వహించాలని వేములవాడ రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్ అన్నారు.సోమవారం సమీకృత కలెక్టరేట్ లోని ఎన్.

 Proper Training Should Be Given To The Polling Staff Vemulawada Revenue Division-TeluguStop.com

ఐ .సి.సమావేశ మందిరంలో లో వేములవాడ రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్ పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాలలో ప్రిసీడింగ్ సహాయ ప్రిసీడింగ్ అధికారులు చేయవలసిన విధులపై సెక్టోరల్ అధికారులు మాస్టర్ ట్రైనర్లకు పి.పి.టి ద్వారా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వేములవాడ రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అర్.డి.ఓ.అన్నారు.ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండటం చాలా కీలకమని, ముఖ్యమైన నిబంధనల పట్ల అవగాహన ఉంటే పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ ఎలాంటి పొరపాట్లు జరగకుండా సజావుగా జరుగుతుందని అన్నారు.

పోలింగ్ అధికారులకు ముఖ్యంగా ఈవీఎం యంత్రాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, మాక్ పోల్ నిర్వహణ, ఈవిఎం యంత్రాల పని తీరు, బాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ ,వివి ప్యాట్ల కనెక్షన్లు, వాటి పని తీరు, మరమ్మత్తు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.వివి ప్యాట్లు ప్రజలకు మరింత భరోసా కలిగించేందుకు భారత ఎన్నికల కమిషన్ 2017 నుంచి వాడకలోకి తీసుకుని వచ్చిందని, ఈవిఎం యంత్రాలకు వివి ప్యాట్ల కనెక్షన్ పకడ్బందీగా చేయాలని, పోలింగ్ కేంద్రంలో ఈవీఎంత్రాలను పోలింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు ఉండేలా చూసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో సి.పి.ఓ /ట్రైనింగ్ నోడల్ అధికారి పి.బి.శ్రీనివాస చారి మాస్టర్ ట్రైనర్స్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube