యాదాద్రి,సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో కేసీఆర్ సుడిగాలి పర్యటన

నల్లగొండ జిల్లా:మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( KCR ) బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించారు.జనగాం జిల్లా పర్యటన ముగించుకొని యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించిన కేసీఆర్ కు గులాబీ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.

 Nalgonda District , Kcr , Telangana, Nagarjuna Sagar, Congress , Ktr, Jagadish-TeluguStop.com

ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా ఈదులపర్రె తండా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద కేసీఆర్‌ వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు.ఎండిన పంటలను పరిశీలిస్తూ, రైతులతో మాట్లాడుతూ కేసీఆర్ పర్యటన కొనసాగింది.

అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లడుతూజనగామ,యాదాద్రి,సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించానని రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారన్నారు.

నీళ్ళు ఇస్తామని ముందు చెప్పారని, కానీ,ఇప్పుడు ఓట్లు వేయించుకొని నీళ్ళు ఇవ్వలేదని,ముందే చెప్తే ఓటు వేయకపోయే వాళ్ళమని రైతులు నాకు చెప్పారని అన్నారు.రైతులకు కావాల్సింది నీళ్ళు,పెట్టుబడి సాయం, 24 గంటల కరెంట్,7600 కేంద్రాల ద్వారా పంట కొనుగోలు చేయటమని తెలిపారు.2014 కంటే ముందు వరి దిగుబడి పెరిగిందని,ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ( Telangana ) వచ్చిందన్నారు.కేసీఆర్ మాట్లాడుతూ ఉండగా కరెంట్ కట్ కావడంతో ఇట్లా పవర్ పోతూ వస్తూ ఉంటుంది చూసారు కదా ఇది రాష్ట్రంలో పరిస్థితి అని చెప్పారు.వంద రోజుల్లోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, స్వల్ప కాలంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

ప్రభుత్వాలురాష్ట్ర మేలును కాంక్షించాలని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.మంచి నీటి కొరత బాగా వచ్చిందని,మిషన్ భగీరథ కు టైం పీరియడ్ పెట్టుకొని ఇచ్చామని,కానీ,హైదరాబాద్ లో నీటి కటకట ప్రారంభం అయ్యిందని,ట్యాంకర్లు తెచ్చుకునే స్థితికి హైదరాబాదు వచ్చిందని,ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు.

మాహయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చానని,ఆనాడు కరెంట్ పోతే వార్త,ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త అని అన్నారు.రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ఇచ్చామని,ఇప్పుడు కనీసం రైతులను సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదని,సీఎంకు డిల్లీ యాత్రలే సరిపోతున్నాయని,మంత్రులకు రాజకీయాలకు సమయం లేదని,ఇక ప్రజలను పట్టించుకునే వారెవరని విమర్శించారు.

మేము ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని, ప్రజల తరుపున కోట్లాడుతామని తెలిపారు.ఆనాడు ఇచ్చిన కరెంట్ కు ఇప్పుడేం అయ్యిందని,ఉన్నది ఉన్నట్లు ఇచ్చే తెలివి కూడా లేదని,రాష్ట్ర ప్రభుత్వానికి పాలన నడిపే తెలివి లేదని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ లో కరెంట్ ఉండటం వల్ల విదేశీ కంపెనీలు,పెట్టుబడులు వచ్చాయని,నేను తీసుకొచ్చిన సంస్కరణలతో నేషనల్ పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేశామని,నాగార్జున సాగర్ ( Nagarjuna Sagar )లో ఇప్పుడు కూడా నీటిని వాడుకోవచ్చని,ఆ తెలివి లేక పంటలను ఎండబెట్టారని, రైతుల బాధలు చూసి బయటికొచ్చానని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి( Jagadish Reddy ),రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube