సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఈ సినిమాలో ఈమె సీతా మహాలక్ష్మి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.
ఈ సినిమా తర్వాత నాని హీరోగా నటించిన హాయ్ నాన్న( Hai Nanna ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) సరసన నటించిన ఫ్యామిలీ స్టార్( Family Star Movie ) అని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మృణాల్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ క్రమంలోనే ప్రేమ పెళ్లి గురించి పిల్లల గురించి కూడా ఈమె ఎన్నో విషయాలు వెల్లడించారు.అయితే మీకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.నాకు సీతారామం సినిమాలోని( Sitaramam Movie ) రామ్( Ram ) లాంటి అబ్బాయిలు అంటే చాలా ఇష్టం.నిజమైన జీవితంలో ఎవరైనా రామ్ లాంటి కుర్రాళ్ళు కనక ఉంటే వచ్చి వెంటనే నన్ను కలవండి.మీకోసం రింగ్ కూడా రెడీగా ఉంది అంటూ ఈమె తనకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారనే విషయాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక సీతారామం సినిమాలో వీరిద్దరూ రామ్ సీతా పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించారు.ఇక నిజ జీవితంలో కూడా తనకు అలాంటి అబ్బాయిలే ఇష్టం అంటూ ఈమె చేసిన కామెంట్స్ అందరిని ఆకట్టుకున్నాయి.