Curly Hair : క‌ర్లీ హెయిర్ ఉన్న‌వారు వేస‌విలో క‌చ్చితంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే!

సాధారణంగా కొందరికి సిల్కీ హెయిర్( Silky Hair ) ఉంటే.ఇంకొందరికి కర్లీ హెయిర్ ఉంటుంది.

 Simple Ways To Protect Curly Hair In Summer-TeluguStop.com

అయితే సిల్కీ హెయిర్ ఉన్నవారు కర్లీ హెయిర్ ను ఇష్టపడతారు.కర్లీ హెయిర్ ఉన్నవారు సిల్కీ హెయిర్ ను ఇష్టపడతారు.

బేసిగ్గా ఎవరిది వారికి నచ్చదు.కాసేపు సిల్కీ హెయిర్ గురించి పక్కన పెడితే.

కర్రీ హెయిర్ ఉన్న వారికి కాస్త కష్టాలు ఎక్కువగా ఉంటాయి.క‌ర్లీ హెయిర్ ను మెయింటైన్ చేయ‌డం అంత సుల‌భం కాదు.

కర్లీ హెయిర్ సహజంగానే కొంచెం డ్రై గా ఉంటుంది.అందులోనూ ప్రస్తుతం వేసవి కాలంలో మరింత డ్రై అయిపోతుంది.

అందుకే వేసవిలో కర్లీ హెయిర్( Curly Hair ) కలిగిన వారు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నలో కొంద‌రికి రెగ్యులర్ గా షాంపూ చేసుకునే అలవాటు ఉంటుంది.కానీ కర్లీ హెయిర్ ఉన్నవారు ఇలా చేయడం వల్ల చాలా నష్టాలు ఎదుర్కొంటారు.

గిరిజాల జుట్టు త్వరగా పొడిబారుతుంది.

Telugu Curly, Curly Tips, Care, Care Tips, Healthy, Latest, Simple Tips, Simplew

రోజూ షాంపూ చేయడం వల్ల సహజంగా ఉండే తేమ కూడా పోతుంది.అందుకే వారానికి రెండుసార్లు మించి షాంపూ చేయ‌కూడ‌ద‌ని నిపుణులు సూచిస్తున్నారు.క‌ర్లీ హెయిర్ క‌లిగిన వారు స‌రైన షాంపూ మ‌రియు కండిషనర్ ను ఎంచుకోవ‌డం ఎంతో ముఖ్యం.

సల్ఫేట్లు, ఆల్కహాల్‌, పారాబెన్స్, ఫ్రాగ్రెన్స్ లేని మైల్డ్ షాంపూ( Mild Shampoo )ను ఎంపిక చేసుకోవాలి.కండిషనర్ లో మాయిశ్చరైజింగ్ ఇన్‌గ్రీడియెంట్స్ ఉండేలా చూసుకోవాలి.క‌ర్లీ హెయిర్ ఉన్న‌వారు కండీష‌న‌ర్ ను పొర‌పాటున కూడా స్కిప్ చేయ‌కూడ‌దు.ఎందుకంటే కండీష‌న‌ర్ జుట్టును తేమ‌గా ఉంచుతుంది.

అలాగే పురాతన కాలం నుంచి జుట్టు సంరక్షణలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది.అయితే వేసవి కాలంలో కర్లీ హెయిర్ కలిగిన వారు వారంలో కచ్చితంగా మూడు సార్లు నూనెను అప్లై చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆయిల్ రాసుకోవ‌డం వ‌ల్ల జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఆయిల్( Hair Oil ) రాసుకున్న నెక్స్ట్ డై త‌ల‌స్నానం చేయ‌క‌పోయినా కూడా జెల్ ఆధారిత కండీష‌న‌ర్ రాసుకుంటే కురులు జిడ్డుగా ఉండ‌కుండా ఉంటాయి.

Telugu Curly, Curly Tips, Care, Care Tips, Healthy, Latest, Simple Tips, Simplew

కర్లీ హెయిర్ ఉన్నవారు తడి జుట్టును దువ్వడం, డ్రైయ‌ర్‌ తో ఆరబెట్టడం, టవల్ తో గట్టిగా రుద్దడం, బిగుతుగా జడ వేసుకోవడం వంటివి చేయకూడదు.ఇలాంటి చిన్న చిన్న తప్పులు వల్ల జుట్టు ఆరోగ్యం పాడవుతుంది.హెయిర్ డ్యామేజ్( Hair Damage ), హెయిర్ హెయిర్‌, డ్రై హెయిర్‌ వంటి సమస్యలు అధికంగా ఇబ్బంది పెడతాయి.ఇక క‌ర్లీ హెయిర్ ఉన్న‌వారు.త‌ల‌స్నానానికి వేడి నీటికి బదులుగా చ‌ల్ల‌టి నీటిని ప్రిఫ‌ర్ చేయాలి.ఇక హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను ఎవైడ్ చేయాలి.

న్యాచుర‌ల్ హెయిర్ మాస్క్‌లు, న్యాచుర‌ల్ టోన‌ర్స్ ను ఎంచుకోండి.మ‌రియు జుట్టు ఆరోగ్యానికి డైట్ లో పోష‌కాహారాల‌తో పాటు బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube