Hyper Aadi : జబర్దస్త్ షోలో కనిపించాలని అసలు అనుకోలేదు.. ఆది ఎంట్రీ వెనుక ఇంత స్టోరీ ఉందా?

బుల్లితెరపై కామెడీ షో గా ఎంతో మంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో దర్శకులు గాను కమెడియన్లుగాను హీరోలుగాను కొనసాగుతూ ఉన్నారు.

 Hyper Aadi Revealed How He Entered Jabardasth Comedy Show-TeluguStop.com

ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి వారిలో హైపర్ ఆది ( Hyper Aadi ) ఒకరు.ఈయన తన అద్భుతమైనటువంటి పంచ్ డైలాగులతో విపరీతమైనటువంటి అభిమానులను సొంతం చేసుకున్నారు.

Telugu Adire Abhi, Show, Hyper Aadi, Hyperaadi, Jabardasth-Movie

ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్( Comedian ) గా వచ్చినటువంటి ఆది అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు.ప్రస్తుతం సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆది మాట్లాడుతూ తాను అసలు జబర్దస్త్ కార్యక్రమంలోకి రావాలని హైదరాబాద్ రాలేదంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Adire Abhi, Show, Hyper Aadi, Hyperaadi, Jabardasth-Movie

తాను బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చానని తెలిపారు.ఇలా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఎప్పుడు తన తోటి వారందరినీ నవ్విస్తూ ఉండేవాడిని.అయితే ఒక రోజు అత్తారింటికి దారేది సినిమా( Attarintiki Daredi )లోని ఒక సన్నివేశాన్ని స్పూఫ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదిరే అభి( Adire Abhi ) అన్న చాలా బాగా చేశారు ఒకసారి నన్ను కలువు అంటూ మెసేజ్ చేశారు.

  ఇక ఆయనని కలిసి తనతో దిగిన ఫోటోని షేర్ చేయడంతో భారీ సంఖ్యలో లైక్స్ వచ్చాయి ఇలా ఒక మనిషితో ఫోటో దిగితేనే ఇన్ని లైక్స్ వచ్చాయంటే ఈ కార్యక్రమంలో చేస్తే ఇంకెలా ఉంటుందో అన్న ఉద్దేశంతోనే నేను జబర్దస్త్ కార్యక్రమంలోకి వచ్చాను అంటూ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube