వ్యకాస పోరాట ఫలితంగానే ఉపాధి కూలీలకు దినసరి వేతనం పెంపు: మట్టిపల్లి

సూర్యాపేట జిల్లా:వ్యవసాయ కార్మిక సంఘం పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం( Central Govt ) ఉపాధి హామీ కూలీలకు రోజు కూలీ రూ.300 కు పెంచిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం( Telangana Agricultural Workers Union ) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు(Saidulu Mattipally ) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.సుప్రీంకోర్టు( Supreme Court ) తీర్పు ప్రకారం ప్రతి కార్మికునికి నెలకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసిందన్నారు.

 As A Result Of The Struggle For Development, The Daily Wages Of Employed Laborer-TeluguStop.com

సుప్రీంకోర్టు సూచన ప్రకారం ప్రతి కార్మికుడికి రోజు కూలీ రూ.600 ఇవ్వాలని గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేశామని పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు రోజు కూలీ రూ.300 కు పెంచిందన్నారు.గతంలో కూలీలకు ఇచ్చిన సమ్మర్ అలవెన్స్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని దాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు.ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించి కూలీలను ఆదుకోవాలని కోరారు.

పని ప్రదేశంలో కనీస సౌకర్యాలైన త్రాగునీరు, మెడికల్ కిట్టు,టెంటు,పార, గడ్డపార వంటి పనిముట్లు అందుబాటులో ఉంచాలన్నారు.పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube