సిద్దార్థ్, అదితిరావు హైదరీ( Siddharth, Aditi Rao Hydari ) పెళ్లి చేసుకున్నట్టు వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చినా నిశ్చితార్థం మాత్రమే జరిగిందని పెళ్లికి ఇంకా సమయం ఉందని క్లారిటీ వచ్చేసింది.ఈ ఏడాది సిద్దార్థ్, అదితి పెళ్లి చేసుకోబోతున్నారని మరికొన్ని రోజుల్లో పెళ్లికి సంబంధించిన తీపికబురును వెల్లడించనున్నారని సమాచారం అందుతోంది.
అయితే వీళ్లిద్దరి సంపాదన కూడా ఒకింత భారీ స్థాయిలో ఉండటం గమనార్హం.
సిద్దార్థ్ ఆస్తుల విలువ 70 కోట్ల రూపాయల రేంజ్( 70 crore range ) లో ఉంటుందని భోగట్టా.
ప్రస్తుతం సిద్దార్థ్ నెల ఆదాయం 10 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది.అదితిరావు హైదరీ ఆస్తుల విలువ సైతం 60 నుంచి 62 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది.
అదితి నెల ఆదాయం నెలకు 3 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని భోగట్టా.సిద్దార్థ్, అదితిలకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.
సిద్దార్థ్, అదితీరావు హైదరీ కలిసి నటించిన మహాసముద్రం సినిమాకు( Mahasamudram movie ) అజయ్ భూపతి దర్శకత్వం వహించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలు కాగా ఆ ప్రేమ పెళ్లి వరకు వచ్చింది.అయితే అటు సిద్దార్థ్ ఇటు అదితి ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్యూర్ మ్యారేజ్ కావడం హాట్ టాపిక్ అవుతోంది.
సిద్దార్థ్, అదితి జోడీ డేటింగ్ గురించి గతంలో చాలా వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తలే నిజమని ప్రూవ్ అయ్యాయి.సిద్దార్థ్ ఆఫర్లు తగ్గినా కంటెంట్ బేస్డ్ సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.సిద్దార్థ్, అదితి భవిష్యత్తులో సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తారో లేదో తెలియాల్సి ఉంది.
సిద్దార్థ్ అదితి రావు హైదరీ జోడీ మాత్రం బాగుందని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.