Viral Video: వీడేంట్రా ఇలా ఉన్నాడు.. పెళ్లి వేదికపై వరుడి ఓవర్ యాక్టింగ్ మాములుగా లేదుగా..!

ఈ మధ్యకాలంలో వివాహ కార్యక్రమాలలో( Marriage Celebrations ) అనేక విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.అందుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం.

 Viral Video Bride Happiness On Stage-TeluguStop.com

కొందరైతే సోషల్ మీడియాలో వైరల్ కావాలని అదే పనిగా చిత్రవిచిత్ర పనులు చేస్తూ వాటిని సోషల్ మీడియా( Social Media )లో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాము.పెళ్లిలో ముఖ్యంగా స్నేహితులతో కలిసి డాన్స్ వేయడం, లేకపోతే స్నేహితులతో కలిసి ప్రాంక్ చేయడం, అనేక సర్ప్రైజ్ ల నడుమ అనేక వీడియోలు వైరల్ గా మారాయి.

ఇక పెళ్లికి సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియోకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో.పెళ్లి మండపంలో అతిథుల మధ్య వధూవరులు ఇద్దరు పెళ్లి వేదిక పైకి చేరుకున్నారు.అయితే ఇందులో భాగంగా స్టేజ్ పైకి ఎక్కే సమయంలో వధువును వారి స్నేహితుల పైకి తీసుకెళ్తుండగా.అదే సమయంలో వరుడు( Groom ) కూడా ఆమె చేయి పెట్టుకొని స్టేజి పైకి తీసుకెళ్తాడు.

అయితే అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత వరుడి ప్రవర్తనలో కాస్త తేడా వచ్చింది.స్టేజి పైకి వెళ్ళిన తర్వాత వరుడు ఒక్కడు కాస దూరంగా వెళ్లి స్టేజిపై ఉన్న సోఫాలో కూర్చున్నాడు.

ఆ తర్వాత వారి బంధువులు దండలు మార్చుకోవాలని చెప్పడంతో.మొదట వధువు( Bride ) దగ్గరికి వరుడు వెళతాడు.ఆ సమయంలో వధువు తన చేతిలో ఉన్న దండను కోరడం మేడలో వేసింది.


ఆ తర్వాత విచిత్ర చూపులతో ఉన్న వరుడు కాస్త కంగారు కంగారుగా ఆమె మెడలో పూలదండను వేస్తాడు.ఆ తర్వాత తన రెండు చేతులను ఎత్తి చప్పట్లు కొట్టుకోవడంతో అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు.అంతటితో ఆగకుండా స్టేజిపై ఉన్న వారిలో కొందరిని కౌగిలించుకొని పిచ్చి పట్టిన వారిలా ప్రవర్తించాడు.

దాంతో అక్కడున్న వారు వరుడుకి పిచ్చి ఏమైనా పట్టిందా అనుకుంటూ షాక్ లో ఉండిపోయారు.ప్రస్తుతం ఈ ఘటన సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube