ప్రకాశం జిల్లాలో( Prakasam District ) ఘోర రోడ్డుప్రమాదం( Road Accident ) జరిగింది.అదుపుతప్పిన ఓ కారు( Car ) డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ఘటన టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో( Surareddypalem ) చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.మృతులు నెల్లూరు జిల్లా కందుకూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.