Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ విజయం కోసం ప్రత్యేక పూజలు చేసిన దిల్ రాజు, విజయ్ దేవరకొండ?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) త్వరలోనే ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.డైరెక్టర్ పరశురామ్( Parasuram ) దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

 Vijay Devarakonda Conduct Special Pooja For Family Star Success-TeluguStop.com

ఇటీవల కాలంలో నటుడు విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.దీంతో ఈ సినిమా ద్వారా ఎలాగైనా హిట్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

విజయ్ దేవరకొండ కెరియర్ లో గీతాగోవిందం సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పరుశురాం డైరెక్షన్లోనే ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా రాబోతుంది.దీంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు కూడా ఉన్నాయి.ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో మంచి విజయం అందుకోవాలనే ఉద్దేశంతో విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.

ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నిర్మాత దిల్ రాజు( Dil Raju ) తన ఆఫీసులో ప్రత్యేక హోమాలు పూజలు చేయించారు.ఈ పూజా కార్యక్రమంలో భాగంగా హీరో విజయ్ దేవరకొండతో పాటు దర్శకనిర్మాతలు పాల్గొన్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి పూజ ఫలం అంది ఫ్యామిలీ స్టార్ సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటి మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube