Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ విజయం కోసం ప్రత్యేక పూజలు చేసిన దిల్ రాజు, విజయ్ దేవరకొండ?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) త్వరలోనే ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

డైరెక్టర్ పరశురామ్( Parasuram ) దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఇటీవల కాలంలో నటుడు విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో ఈ సినిమా ద్వారా ఎలాగైనా హిట్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. """/" / విజయ్ దేవరకొండ కెరియర్ లో గీతాగోవిందం సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పరుశురాం డైరెక్షన్లోనే ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా రాబోతుంది.

దీంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు కూడా ఉన్నాయి.ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో మంచి విజయం అందుకోవాలనే ఉద్దేశంతో విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.

"""/" / ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నిర్మాత దిల్ రాజు( Dil Raju ) తన ఆఫీసులో ప్రత్యేక హోమాలు పూజలు చేయించారు.

ఈ పూజా కార్యక్రమంలో భాగంగా హీరో విజయ్ దేవరకొండతో పాటు దర్శకనిర్మాతలు పాల్గొన్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి పూజ ఫలం అంది ఫ్యామిలీ స్టార్ సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటి మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు.. పోలీస్ స్టేషన్ కు తరలింపు..