నటిగా యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రష్మీ గౌతమ్ ( Rashmi Gautham ) ఒకరు.ఈమె హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.
అనంతరం ఈమె యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ ( Sridevi Drama Company ) జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉండే రష్మీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ మీడియా( Social media ) వేదికగా కొన్ని పోస్టులకు రిప్లై ఇస్తూ పలు సందర్భాలలో వివాదాలను కూడా ఎదుర్కొన్నారు.అయితే తాజాగా ఈమె జొమోటో గ్రీన్ డ్రెస్ మీద స్పందిస్తూ రష్మిక ఓ పోస్ట్ చేసింది.వెజిటేరియన్ కి గ్రీన్ డ్రెస్ పెడితే, సపరేట్ ఆప్షన్ పెడితే తప్పేంటి అంటూ జొమోటో నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ పై ఒక నెటిజన్ రిప్లై ఇస్తూ కేవలం రీచ్ కోసం, అటెన్షన్ కోసమే కదా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
ఈ కామెంట్ పై రష్మీ స్పందిస్తూ.రీచ్ కోసమైతే నేను ఇలాంటి విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.ఒక్క ఫోటో చాలు జూమ్ చేసీ మరీ సొల్లు కారుస్తూ అవసరం లేని అటెన్షన్ ఇస్తారు.
మొత్తానికి నీకైతే ఆ టెన్షన్ దొరికిందని నేను అనుకుంటున్నాను ఎన్ని రోజుల నుంచి ఈ ఆ టెన్షన్ కోసం ఎదురు చూస్తున్నావో అంటూ ఈమె నేటిజన్ చేసినటువంటి కామెంట్ పై దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తూ చేస్తున్నటువంటి ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.