రాజన్న సిరిసిల్ల జిల్లా: శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా, ప్రజలు తామ ఓటు హక్కు ధైర్యంగా ,స్వేచ్ఛగా వినియోగించుకునెలా వారిలో నమ్మకం, భరోసా, భద్రత కలిగేలా జిల్లాలో కేంద్ర సాయుధ బలగాలు, జిల్లా పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించడం జరుగుతుందని,ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ఎస్పీ అన్నారు.వేములవాడ పట్టణంలో తిప్పపూర్ బస్టాండ్ నుండి గుడి నుండి బద్దీ పోచమ్మ,పోలీస్ స్టేషన్ మీదుగా చెక్కపెళ్లి బస్టాండ్ ,కోరుట్ల బస్టాండ్ వరకు ఫ్లాగ్ మార్చ్ సాగింది.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా చేయడంలో భాగంగా స్థానిక పోలీసులు,కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలందరికీ ఎన్నికల పట్ల భద్రత, భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ముఖ్యంగా సమస్యత్మక గ్రామాల పై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ తెలిపారు.జిల్లాలో అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు జిల్లాలో 06 చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని,
అంతే కాక జిల్లా పరిధిలో.
డైనమిక్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని 50,000 రూపాయల నగదు కంటే ఎక్కువ తీసుకవెళ్తే అట్టి నగదు సీజ్ చేసి జిల్లా గ్రీవియెన్స్ కమిటీకి అప్పజెప్పడం జరుగుతుందన్నారు.ప్రజలు యాభై వేల కంటే ఎక్కువ నగదు తీసుకవెళ్తే దానికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని లేని యెడల సీజ్ చేయడం జరుగుతుందని ప్రజలు వాహనాల తనిఖీ సహకరించాలన్నారు.
ఎస్పీ వెంట సి.ఐ లు కరుణాకర్, శ్రీనివాస్, ఎస్.ఐ లు పృథ్విదర్ గౌడ్,అంజయ్య, రాజు ,జిల్లా పోలీస్ బలగాలు, కేంద్ర సాయుధ బలగాల సిబ్బంది పాల్గొన్నారు.