సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా: దేశ స్వాతంత్రం కోసం స్వేచ్ఛ,సమానత్వానికి విభిన్న విప్లవ మార్గంలో పోరాటం నిర్వహించి ఆంగ్లేయుల వెన్నులో వణుకుపుట్టించి అమరులైన స్వాతంత్ర సమరయోధులకు మరణం లేదని సీపీఐ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్ అన్నారు.శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలను సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి,ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

 Bhagat Singh 93rd Death Anniversary Celebrations Under The Auspices Of Cpi, Bhag-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ వీర మరణం పొంది 93 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వాలు ఇప్పటివరకు వర్ధంతి,జయంతులను ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు.ఈకార్యక్రమంలో చిలువేరు అంజయ్య, పల్లె మల్లారెడ్డి,కొండూరు వెంకటేష్,ముత్యాల అంజయ్య,గడ్డం యాదగిరి,పందుల యాదగిరి,భీమనపల్లి గాలయ్య,రమేష్, మల్లయ్య,మొగదాల సత్తయ్య,పల్లె రాములు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube