తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ అహర్నిశలు కష్టపడుతూ ముందు దూసుకెళ్తుంటారు.ఇక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్( Prabhas ) వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటుతున్నాడు.ఇంకా ఇప్పుడు రాజాసాబ్, కల్కి సినిమాలతో మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలు ముగిసిన తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి డైరెక్షన్ లో స్పిరిట్( Spirit Movie ) అ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే…

ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ని( Akshay Kumar ) ఒక కీలకమైన పాత్రలో తీసుకోబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) కూడా అక్షయ్ కుమార్ కి ఇప్పటికే ఒక కథ చెప్పి ఆయనని ఒప్పించి ఈ సినిమాలో భాగం చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.అయితే ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది మాత్రం ఇప్పుడు రివిల్ చేయడం లేదు.ఆయన విలన్ గా చేస్తున్నాడా? లేకపోతే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఇటు ప్రభాస్ గాని, అటు సందీప్ రెడ్డి వంగ గానీ భారీ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే గత సంవత్సరం సందీప్ వంగ అనిమల్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తే , ప్రభాస్ సలార్ సినిమాతో భారీ హిట్ కొట్టడమే కాకుండా ఈ సినిమాతో 800 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా మరోసారి తనని తను ప్రూవ్ చేసుకోబోతున్నాడు.ఇక మొత్తానికైతే ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదగడమే కాకుండా వరుసగా ఐదు సినిమాలు తో 300 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు…
.







