తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా శ్రీకాంత్( Hero Srikanth ) తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.శ్రీకాంత్ చేసిన సినిమాలు ఆయనకి మంచి గుర్తింపు సంపాదించి పెట్టడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్( Family Audiance ) లో కూడా విపరీతమైన క్రేజ్ ను తీసుకువచ్చాయి.
ఇక ఈయన చేసిన సినిమాలు చాలా వరకు సక్సెస్ సాధించాయి.ఇక అందులో భాగంగానే ఆయన నటించిన సినిమాల్లో పెళ్లి సందడి లాంటి సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించాడు.
ఇక ఇలాంటి క్రమంలో ఆయన కి ఒక సెపరేట్ క్రేజ్ అయితే వచ్చింది.అయితే ఇండస్ట్రీలో శ్రీకాంత్ కంటే ముందే రాజశేఖర్( Rajasekhar ) యాంగ్రీ యంగ్ మాన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఆయన చేసిన సినిమాలన్నీ చాలా పవర్ ఫుల్ సినిమాలు కావడంతో ఆయన చేసే పాత్రలు కూడా చాలా రఫ్ గా ఉండేవి.అయితే రాఘవేందర్రావు చేసిన అల్లరి ప్రియుడు సినిమా( Allari Priyudu )లో మొదట శ్రీకాంత్ ను హీరోగా తీసుకుందామనుకున్నాడట.కానీ ఆయనతో చేసిన పెళ్లి సందడి సినిమా( Pelli Sandadi ) సూపర్ హిట్ అవడంతో మళ్లీ ఆయనతో సినిమా చేయడం ఎందుకు అని రాజశేఖర్ ను హీరోగా పెట్టి ఈ సినిమా చేయాలనుకున్నాడు ఆయన అయితే చాలా కొత్తగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఆయన పెట్టి ఈ సినిమా తీశాడు.
ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది.దాంతో రాజశేఖర్ కి ఒకసారి రొమాంటిక్ హీరోగా( Romantic Hero ) మంచి గుర్తింపు వచ్చింది.ఒక రకంగా చెప్పాలంటే శ్రీకాంత్ చేయాల్సిన సినిమాతో రాజశేఖర్ సూపర్ హిట్ కొట్టాడనే చెప్పాలి.
ఇక మొత్తానికైతే ఇప్పుడు వాళ్లిద్దరు కూడా హీరోలుగా ఫేడ్ అవుట్ అయిపోయారు.కాబట్టి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా చేస్తూ తమకంటూ మంచి గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఇక వీళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి…
.