అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను( Donald Trump ) వరుస కేసులు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా న్యూయార్క్ సివిల్ ఫ్రాడ్ కేసు( Newyork Civil Fraud Case ) ట్రంప్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.
ఒకరకంగా ఆయన వ్యాపారాలు మూసివేసే పరిస్ధితి వస్తుందని అంతా భావించారు.కానీ కోర్టు జరిమానాతో సరిపెట్టింది.
అయినప్పటికీ అది ఆషామాషీ జరిమానా కాదు.దాదాపు 454 మిలియన్ల బాండ్‌ను ట్రంప్ కోర్టుకు సమర్పించాల్సి వుంది.
ట్రంప్ అమెరికాలోని సంపన్నుల్లో ఒకరు.అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడం ఆయనకైనా కష్టమే.
ఈ క్రమంలోనే కొన్ని ఆస్తులను అమ్మాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ట్రంప్ కనుక అప్పీల్ బాండ్‌ను కోర్టుకు సమర్పించడని పక్షంలో న్యూయార్క్ ప్రాంతంలోని అతని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రమాదముంది.రియల్ ఎస్టేట్ దిగ్గజమైన ట్రంప్‌కు చెందిన అత్యంత విలువైన ఆస్తులు .‘‘ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ వెస్ట్ చెస్టర్, 212 ఎకరాల సెవెన్ స్ప్రింగ్స్ ఎస్టేట్‌లను ప్రభుత్వం సీజ్ చేసే ప్రమాదముంది.కోర్టు ఆదేశించిన బాండ్‌ను సమర్పించడానికి మార్చి 25 వరకు గడువుంది.ఈ గడవు తీరిపోతే ట్రంప్ ఆస్తులను( Trump Assets ) స్వాధీనం చేసుకోవడానికి జేమ్స్ సిద్ధంగా వున్నాడు.
న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్( Newyork Attorney General Letitia James ) నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ట్రంప్ ఆర్ధిక కష్టాలు కీలక దశకు చేరుకున్నాయి.ప్రఖ్యాత ట్రంప్ టవర్ సహా ఆయన ఖాతాలు జప్తు అంచున వున్నందున.
అవసరమైన నిధులను సేకరించడానికి ట్రంప్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
తన ఆస్తులను స్వచ్ఛందంగా విడిచిపెట్టేందుకు ట్రంప్ విముఖత చూపుతున్నట్లు ఓ కథనం పేర్కొంది.అందుకే ప్రభావవంతమైన మిత్రుల నుంచి సహాయం కోరుతున్నారు ట్రంప్.ఒకవేళ ట్రంప్ దివాలా తీసినట్లయితే అది 2024 ఎన్నికల రేసులో ఆయన అవకాశాలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు.
అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ట్రంప్ ఆర్ధిక స్థితిని దెబ్బతీసే విధంగా .బకాయి వున్న మొత్తాన్ని తిరిగి పొందడానికి స్వాధీనం చేసుకున్న ఆస్తులను లిక్విడేట్ చేసే అధికారాన్ని కలిగి వున్నారు.న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది ఆడమ్ లీట్‌మన్ బెయిలీ ది మిర్రర్‌తో మాట్లాడుతూ.ఆస్తులను పూర్తిగా సంపాదించడం కంటే ద్రవ్య బకాయిలను తిరిగి పొందడంపై దృష్టి సారిస్తే మంచిదని సూచించారు.