గత కొన్ని రోజులుగా పెనమలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై జరుగుతున్న సస్పెన్స్కు తెరపడింది.తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బోడే ప్రసాదును అధిష్టానం ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలలో ఆనందోచాలు నిండాయి.
బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంచుకుని తమ సంతోషాన్ని తెలియజేశారు.పెనమలూరు లోని బోడె ప్రసాద్ కార్యాలయం లో అభిమానులునాయకులు కార్యకర్తలతో నిండిపోయింది.
బోడె ప్రసాదును అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.పెనమలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరపడటంతో కార్యకర్తలు నూతన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన పైన ఉంచిన నమ్మకాన్ని ఉమ్మకానీనని భారీ మెజార్టీతో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని తన వెంట నిలిచిన కార్యకర్తలు నాయకులు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.