Ice Cream : ఫ్రిడ్జ్‌లోని ఐస్‌క్రీమ్‌ బాక్స్ కొట్టేసిన చిన్నారి.. ఎలా ఎత్తుకెళ్లిందో చూస్తే నవ్వే నవ్వు..

చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఫుడ్ ఐటమ్ ఐస్‌క్రీమ్‌.స్వీట్ అండ్ క్రీమీగా ఉండే ఇది అనేక ఫ్లేవర్స్ లో వస్తుంది.

 The Child Who Hit The Ice Cream Box In The Fridge And How It Was Picked Up Is A-TeluguStop.com

చిన్నపిల్లలను ఎప్పుడూ నోరూరిస్తుంది, అయితే తల్లిదండ్రులు సాధారణంగా తమ పిల్లలకు ఐస్‌క్రీమ్‌( Ice cream ) కొనివ్వడానికి ఇష్టపడరు.వీటి వల్ల పిల్లల ఆరోగ్యం పాడవుతుందని దూరంగా ఉంచుతారు.

కానీ పిల్లలు వాటిని తినడానికి ఎలాగోలా ట్రై చేస్తూనే ఉంటారు.ఇటీవల వైరల్ వీడియోలో ఓ చిన్నారి ఫ్రొజెన్ డెజర్ట్‌ను తినేయడానికి ఫ్రిడ్జ్ లో నుంచి దానిని కొట్టేసింది.

ఆ బాలికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోకు 15.7 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చిన్నపిల్లల సామర్థ్యం, సంకల్పాన్ని ప్రదర్శిస్తుంది.

ఈ వీడియోలో ఒక పసిపిల్ల ఐస్ క్రీమ్‌ను తీసుకోవడానికి రిఫ్రిజిరేటర్‌ డోర్‌ను వేగంగా ఓపెన్ చేయడం మనం చూడవచ్చు.ఆ బాలిక ఐస్ క్రీమ్‌ టబ్‌ని చేత పట్టుకున్న తర్వాత తల్లి గమనిస్తుంది, దానిని తినకుండా చిన్నారిని ఆపడానికి ప్రయత్నిస్తుంది.

అయితే ఆ చిన్నారి తల్లికి దొరక్కుండా పరిగెత్తుకుంటూ దూరంగా వెళుతుంది.అలా వెళ్లే క్రమంలో అనుకోకుండా ఐస్‌క్రీమ్‌ను పడేస్తుంది, మళ్లీ దానిని కలెక్ట్ చేసుకుని సోఫా దగ్గరికి వెళ్లి దానిపై ఎక్కి కూర్చుంటుంది.

అక్కడ హాయిగా కూర్చున్న తర్వాత ఐస్ క్రీమ్‌ బాక్స్ తెరిచి, అందులో వేలు ముంచి, ఆ తీపి రుచిని ఆస్వాదిస్తూ, దానిని “యమ్మీ” అని అంటుంది.ఆ పిల్ల అలా అనడం వింటుంటే చాలా చాలా నవ్వు వచ్చేస్తుంది.

ఈ పిల్ల చేష్టలు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల హృదయాలను దోచుకున్నాయి, చాలామంది ఈ చిన్నారి చిలిపి దొంగతనం చేసే నవ్వుకుంటున్నారు.ఈ బుడ్డది కారు డోర్ లాంటి అంత దృఢమైన ఫ్రిజ్ తెరిచి, ఆ తర్వాత సోఫాలోకి దూసుకెళ్లిన దృశ్యం పలువురిని అలరించింది.ఈ చిన్నారి చేసిన సాహసానికి తల్లి కూడా ఫిదా అయ్యే ఉంటుంది.ఐస్ క్రీమ్‌ అనేది వారి జీవితాల్లో హాయిగా నవ్వుకోడానికి కారణమై ఉంటుంది.ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube